ఆరేళ్ల బాలికపై బాలుడు అత్యాచారం

ABN , First Publish Date - 2022-01-23T06:05:21+05:30 IST

ఆరేళ్ల బాలికపై పదమూడేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేసి జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.

ఆరేళ్ల బాలికపై బాలుడు అత్యాచారం

భీమునిపట్నం/విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల బాలికపై పదమూడేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేసి జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. భీమిలి మండలం కాపులుప్పాడకు చెందిన ఆరేళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బాలిక ఇంటి సమీపంలోనే వుండే 13 బాలుడు...ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. బాలిక ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లి వెతకడం ప్రారంభించింది. బాలుడి ఇంటికి వెళ్లేసరికి ఈ అఘాయిత్యం కంటపడింది. దీంతో బాలిక తల్లి రాత్రి పది గంటలకు భీమిలి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో సీఐ జీవీ రమణ కేసు నమోదుచేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు పంపించారు. దిశ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని శనివారం జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.

Read more