సబ్సిడీపై రూ.5లక్షలు రుణాలివ్వాలి

ABN , First Publish Date - 2022-09-08T06:41:38+05:30 IST

గొర్రెలు, మేకల పెంపకందారులకు 50 శాతం సబ్సిడీపై రూ.ఐదు లక్షల వరకూ రుణాలు ఇవ్వాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు గంటా శ్రీరామ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

సబ్సిడీపై రూ.5లక్షలు రుణాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంటా శ్రీరామ్‌


గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్‌

చీడికాడ, సెప్టెంబరు 7: గొర్రెలు, మేకల పెంపకందారులకు 50 శాతం సబ్సిడీపై రూ.ఐదు లక్షల వరకూ రుణాలు ఇవ్వాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు గంటా శ్రీరామ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మండలంలోని బి.సింగవరంలో బుధవారం కాపర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అన్ని గొర్రెలు, మేకలకు నాలుగు సార్లు డివార్మింగ్‌, వ్యాక్సిన్‌లు వేయాలని కోరారు. జగనన్న పశునష్టపరిహారం పథకం ద్వారా ఒక జీవి మృతి చెందిన నష్టపరిహారాన్ని ఇవ్వాలన్నారు. పెంపకందారులందరికీ విత్తన పొట్టేళ్లను వంద శాతం సబ్సిడీపై అందించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన పెంపకందారులకు వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు. గొర్రెలు, మేకలు రాత్రి వేళల్లో నివాసం ఉండడానికి ప్రభుత్వం షెడ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం డైరెక్టర్‌ పినబోయిన అప్పారావు యాదవ్‌, స్థానిక నాయకులు యలమంచిలి శ్రీనివాసరావు, పంచదార్ల దేముళ్లు, చొప్ప రమణ, పలువురు కాపర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-08T06:41:38+05:30 IST