జిల్లాలో 31185 మందికి జగనన్న తోడు లబ్ధి

ABN , First Publish Date - 2022-08-04T05:45:22+05:30 IST

3: జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 31,185 మంది లబ్ధిదారులకు రూ.31.18 కోట్లు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

జిల్లాలో 31185 మందికి జగనన్న తోడు లబ్ధి
లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, ఎమ్మెల్యే ముత్తంశెట్టి

మహారాణిపేట, ఆగస్టు 3: జగనన్న తోడు పథకం ద్వారా  జిల్లాలో 31,185 మంది లబ్ధిదారులకు రూ.31.18 కోట్లు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.  2022 వ సంవత్సరానికి జగనన్న తోడు పథకం లబ్ధిదారులకు రుణ సహాయం చేసే కార్యక్రమం బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రుణ సాయం సక్రమంగా చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ మాఫీ కింద మొత్తం 34749 మందికి రూ.61.67 లక్షలు జమచేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన కూరగాయలు, వస్త్ర వ్యాపార స్టాల్స్‌ను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రవీంద్ర బాబు, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ ఎ.విజయనిర్మల, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T05:45:22+05:30 IST