విద్యా వ్యవస్థ వినాశనానికే 117 జీవో

ABN , First Publish Date - 2022-09-10T06:31:42+05:30 IST

విద్యా వ్యవస్థ వినాశనానికే ప్రభుత్వం 117 జీవోను జారీ చేసిందని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యా వ్యవస్థ వినాశనానికే 117 జీవో
నక్కపల్లి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న త్రినాథ్‌- ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రినాథ్‌ ఆగ్రహం

- ఈ జీవోతో పాటు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌

నక్కపల్లి, సెప్టెంబరు 9 : విద్యా వ్యవస్థ వినాశనానికే ప్రభుత్వం 117 జీవోను జారీ చేసిందని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రాజయ్యపేట, పెదబోదిగల్లం, జానకయ్యపేట, నక్కపల్లి గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకే 117 జీవోను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఈ జీవోతో పాటు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఏ బకాయిలు వెంటనే విడుదల చేసి, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కౌన్సిలర్‌ పి.గణపతి, ఫెడరేషన్‌ ప్రతినిధులు దాడిశెట్టి కొండలరావు, శ్రీనివాసరావు, అప్పలరాజు, గణేశ్‌, నాగూర్‌ , చంద్రరావు, సత్తిబాబు, జగదీశ్‌, అర్జున రామకృష్ణ, బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Read more