10 మంది హాకర్లకు జరిమానా

ABN , First Publish Date - 2022-02-19T06:24:11+05:30 IST

దువ్వాడ రైల్వే స్టేషన్‌ ఫరిధిలో అనుమతులు లేకుండా రైళ్లలో అనధికారికంగా వ్యాపారాలు సాగిస్తున్న పది మంది హాకర్లకు రైల్వే ప్రత్యేక న్యాయస్థానం జరిమానా విధించింది.

10 మంది హాకర్లకు జరిమానా

కూర్మన్నపాలెం, ఫిబ్రవరి 18:  దువ్వాడ రైల్వే స్టేషన్‌ ఫరిధిలో అనుమతులు లేకుండా రైళ్లలో అనధికారికంగా వ్యాపారాలు సాగిస్తున్న పది మంది హాకర్లకు రైల్వే ప్రత్యేక న్యాయస్థానం జరిమానా విధించింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌ ఆవరణలో  రైల్వే ప్రత్యేక న్యాయస్థానం క్యాంప్‌ కోర్టు నిర్వహించింది. రైల్వే ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సీహెచ్‌.శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సలహాలు, సూచనలు అందించారు.  ఆటో డ్రైవర్ల హక్కులు, బాధ్యతలను వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో దువ్వాడ ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ కుమారరావు, జీఆర్పీ ఎస్‌ఐ శాంతారామ్‌ పాల్గొన్నారు.


Read more