ఎమ్మెల్సీ ఓటర్లు 2,83,749

ABN , First Publish Date - 2022-12-31T01:49:40+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.

ఎమ్మెల్సీ ఓటర్లు 2,83,749

ఓటర్ల వివరాలు

జిల్లా పురుషులు మహిళలు మొత్తం

శ్రీకాకుళం 35,762 15,589 51,356

విజయనగరం 38,335 19,716 58,060

పార్వతీపురం మన్యం 12,404 5,952 18,358

అల్లూరి సీతారామరాజు7,816, 3,605 11,424

అనకాపల్లి 27,333 13,756 41,095

విశాఖపట్నం 57,146 46,298 1,03,459

(అన్ని జిల్లాల్లో కలిపి 37 మంది ట్రాన్స్‌జండర్లు ఉన్నారు)

తుది జాబితా విడుదల

అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,03,459 ఓటర్లు

అనకాపల్లి జిల్లాలో 41,095 మంది

అల్లూరి జిల్లాలో 11,424 మంది

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 297 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,83,759 మంది ఓటర్లు వున్నట్టు చీఫ్‌ ఎలకో్ట్రల్‌ అధికారి ప్రకటించారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న పీవీఎన్‌ మాధవ్‌ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల ప్రక్రియ మొదలెట్టారు. పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచి నవంబరు ఏడో తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాల నుంచి 2,67,728 మంది దరఖాస్తు చేయగా, 22,625 తిరస్కరిస్తూ...2,43,903 మందిని ఓటర్లు గుర్తిస్తూ ముసాయిదా జాబితా విడుదల చేశారు. దీనిపై గత నెల 23వ తేదీ నుంచి డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడంతోపాటు కొత్తగా ఓటరు నమోదుకు మరోమారు దరఖాస్తులు స్వీకరించారు. చివరికి అన్ని వడపోతల అనంతరం ముసాయిదా జాబితా నుంచి 10,884 మందిని తొలగించగా, కొత్తగా 50,730 మందిని జతచేశారు. 2,83,749 మందితో తుది జాబితాను విడుదల చేశారు. ఇందులో పురుషులు 1,78,796, మహిళలు 1,04,916 మంది కాగా 37 మంది ట్రాన్స్‌జండర్లు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,03,459 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా అల్లూరి జిల్లాలో కేవలం 11,424 మంది ఉన్నారు. 58,060 మందితో విజయనగరం రెండో స్థానంలో, 51,356 మందితో శ్రీకాకుళం మూడో స్థానంలో, 41,095 మందితో అనకాపల్లి నాలుగో స్థానంలో, 18,358 మందితో పార్వతీపురం మన్యం జిల్లా ఐదో స్థానంలో ఉన్నాయి.

Updated Date - 2022-12-31T01:49:41+05:30 IST