శ్రీశైలంలో ట్రాఫిక్‌ జాం పోలీసుల వైఫల్యమే: కొట్టు

ABN , First Publish Date - 2022-11-15T03:27:22+05:30 IST

శ్రీశైలంలో ఆదివారం జరిగిన ట్రాఫిక్‌ జామ్‌ సమస్యకు పోలీస్‌ సిబ్బంది సమన్వయ లోపమే కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

శ్రీశైలంలో ట్రాఫిక్‌ జాం పోలీసుల వైఫల్యమే: కొట్టు

శ్రీశైలం, నవంబరు 14: శ్రీశైలంలో ఆదివారం జరిగిన ట్రాఫిక్‌ జామ్‌ సమస్యకు పోలీస్‌ సిబ్బంది సమన్వయ లోపమే కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శ్రీశైల భ్రమరాంబ వసతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి తరువాత రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం రూ.30-40 కోట్లతో అన్ని సౌకర్యాలతో కూడిన క్యూకాంప్లెక్స్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విశాఖపట్టణానికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. నారా లోకేశ్‌కు ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదని తెలిపారు. మంగళగిరి అని స్పష్టంగా పలకగలిగితే, ఆ తరువాత ఆయన గురించి తాను మాట్లాడతానన్నారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో నరేంద్ర మోదీని కలిసిన తరువాత పవన్‌ నోరు తగ్గించుకున్నారని అన్నారు. టీడీపీ మోసపూరిత పార్టీ అని, ఆ పార్టీతో కలసి వెళ్లకూడదని మోదీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతోందని ఆయన తెలిపారు. దేవదాయశాఖ ఉద్యోగులు కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకుంటే డీపీసీ ఏర్పాటుచేసి పదోన్నతులు ఇస్తామని అ న్నారు.

Updated Date - 2022-11-15T03:27:22+05:30 IST

Read more