వైపీసీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

ABN , First Publish Date - 2022-12-31T23:42:59+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ప్రజలకు పిలుపుని చ్చారు. చీడివలసకు చెందిన బీసీ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు పిల్లా కన్నన్నాయుడు మాతృమూర్తి ఇటీవల మృతి చెందారు. శనివారం కన్నన్నా యుడును రవికుమార్‌ పరామర్శించారు.

 వైపీసీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
మాట్లాడుతున్న రవికుమార్‌

బూర్జ: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ప్రజలకు పిలుపుని చ్చారు. చీడివలసకు చెందిన బీసీ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు పిల్లా కన్నన్నాయుడు మాతృమూర్తి ఇటీవల మృతి చెందారు. శనివారం కన్నన్నా యుడును రవికుమార్‌ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం నిత్యావసరాలతో పాటు బస్సు, విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌, పెట్రోల్‌ ధరలను పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరి చిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేదని, దీనివల్ల యువతకు ఉద్యోగ వకాశాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. చంద్రబాబు మళ్లీ ము ఖ్యమంత్రి అయ్యే వరకూ సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆనెపు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:43:02+05:30 IST