ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న వైసీపీ పాలన

ABN , First Publish Date - 2022-07-06T05:20:19+05:30 IST

దొంగని ముఖ్యమంత్రి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల బతుకులు చెడిపోయాయని, మూడున్నరేళ్ల వైసీపీ పాలన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు.

ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న వైసీపీ పాలన
మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు


 ధరల పెంపు వెనుక జగన్‌ ధనదాహమే 

  ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

టెక్కలి, జూలై 5: దొంగని ముఖ్యమంత్రి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల బతుకులు చెడిపోయాయని, మూడున్నరేళ్ల వైసీపీ పాలన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. మంగళ వారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.. ‘సీఎం జగన్‌ మద్యంలో మాఫియాను దించి స్వయంగా డబ్బులు సంపాదిస్తున్నారు.. నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచడం ద్వారా పేదలపై పెను భారం మోపారు.. జగన్‌ ధన దాహానికి ఇవి నిదర్శనం.. ఇసుక కుంభకోణంలో వైసీపీ నాయకులు బకాసు రుల్లా తినేస్తున్నారు.. బీసీ నాయ కుడిని అవమానిం చాలనే ఉద్దేశంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును భీమవరం లో అల్లూరి శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ సభకు ఆహ్వా నించి.. ఆ తదుపరి ప్రొటోకాల్‌ను కాదని అవమాన పరిచారు’.. అని అన్నారు.  అల్లూరి చిత్ర పటానికి ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో హనుమంతు రామ కృష్ణ, మట్ట పురుషోత్తం, లవకుమార్‌ పాల్గొన్నారు.


బైదలాపురం వద్ద వంతెన నిర్మాణానికి కృషి 

సారవకోట (జలుమూరు): బైదలాపురం వద్ద వంశధార ప్రధాన ఎడమ కాలువపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.  వంశధార కాలువపై వంతెన కూలిపోయిందని, దీంతో రాకపోక లకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా మంగళవారం పరిశీలించారు. వంతెన నిర్మాణానికి నాబార్డు నుంచి నిధులు రప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అలా గే జలుమూరు మండలం కరకవలస పంచాయతీ కిట్టాలపాడు వద్ద వంశధార కాలువపై శిథిలావస్థలో ఉన్న వంతెనను పరిశీలించి దీని స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పార్టీ మండల అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

 

Read more