ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2022-12-31T00:08:45+05:30 IST

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అన్ని వి ధాలా జిల్లా యం త్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడం ద్వారా ఇప్పటికే రూ.1,21,15,000 పరిహారాన్ని బాధితులకు అందించినట్లు చెప్పారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

అరసవల్లి: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అన్ని వి ధాలా జిల్లా యం త్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడం ద్వారా ఇప్పటికే రూ.1,21,15,000 పరిహారాన్ని బాధితులకు అందించినట్లు చెప్పారు. శుక్రవారం సాం ఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, అట్రాసిటీ కేసు లపై విజిలెన్స్‌ అండ్‌ మానటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడు తూ.. నగరంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆడిటోరియం కోసం వాంబే కాలనీలోని సర్వే నెం.703/1లో ఏడు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల గురుకుల పాఠశాలలో మర ణించిన ఓ విద్యార్థి తల్లికి పొరుగు సేవల ప్రాతిపదికన అటెండర్‌ పోస్టును మంజూ రు చేశామన్నారు. దళ్లవలస ఎస్సీ కాలనీ సమీపంలోని డంపింగ్‌ యార్డును వేరే చోటుకు మార్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విధ్యార్థుల స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, వారికి ప్రత్యేక హాస్టల్‌ నిర్మాణానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని తెలి పారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాల మంజూరుకు తగు చర్యలు తీసుకో వాలని ఆ శాఖ ఈడీని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ జీఆర్‌ రాధిక, జేసీ ఎం.న వీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి, శ్రీకాకుళం, పలాస డీఎస్పీలు మహేం ద్ర, శివరాంరెడ్డి, డీఆర్వో ఎం.రాజేశ్వరి, సాంఘిక సంక్షేమశాఖ ఏడీ ఆర్‌.గడ్డెమ్మ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కె.రామారావు, శ్రీకాకుళం, పలాస ఆర్డీవోలు బొడ్డేపల్లి శాంతి, సీతా రామారావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.సురేఖ పాల్గొన్నారు.

నగదు రహిత చికిత్స అందించాలి

ఆరోగ్యశ్రీ కింద రోగులకు నగదు రహిత చికిత్స అందించా లని, వారిపై ఎలాంటి భారంపడకూడదని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా క్రమశిక్షణ సంఘం, వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా నగదు రహిత చికిత్స అందించాల్సిన బాధ్యత ఆస్పత్రులపై ఉంది. ప్రత్యేకించి ఓపీ నుంచి ఐపీకి మారేటప్పుడు పెండింగ్‌లో ఉన్న అన్నింటినీ క్లియర్‌ చేయాలి. ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లో 3255 విధానాలు ఉన్నాయి. కొత్త కియోస్క్‌లు 32 ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేశాం.’ అని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.మీనాక్షి, ఆస్పత్రుల సమన్వయాధికారి జె.భాస్కరరావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ప్రకాష్‌, జెమ్స్‌ ప్రాంతీయ ఆరోగ్యాఽధికారి ప్రవీణ్‌, కృష్ణమోహన్‌, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:08:47+05:30 IST