మహిళ దారుణ హత్య!

ABN , First Publish Date - 2022-03-06T03:44:47+05:30 IST

ఆమదాలవలసలో మహిళ దారుణహత్యకు గురైంది. రైల్వేగేటు సమీపంలోని ఎల్‌.అప్పారావు కాలనీలో నివాసముంటున్న పాతిన అనురాధ (28) అనే మహిళ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన అర్ధరాత్రి వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందగిరిపేటకు చెందిన అనురాధను అదే గ్రామానికి చెందిన అప్పలనాయుడు 11 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. కొన్నేళ్ల పాటు వీరి జీవితం సవ్యంగా సాగినా.. మనస్పర్థల కారణంగా విడిపోయారు.

మహిళ దారుణ హత్య!
రక్తపు మడుగులో పడి ఉన్న అనురాధ

ఇంట్లోనే చంపి తాళం వేసిన అగంతకులు
ఆమదాలవలసలో ఘటన
ఆమదాలవలస, మార్చి 5:
ఆమదాలవలసలో మహిళ దారుణహత్యకు గురైంది. రైల్వేగేటు సమీపంలోని ఎల్‌.అప్పారావు కాలనీలో నివాసముంటున్న పాతిన అనురాధ (28) అనే మహిళ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన అర్ధరాత్రి వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందగిరిపేటకు చెందిన అనురాధను అదే గ్రామానికి చెందిన అప్పలనాయుడు 11 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. కొన్నేళ్ల పాటు వీరి జీవితం సవ్యంగా సాగినా.. మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటికే వీరికి ఒక కుమార్తె సౌమ్య ఉంది. ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి ఎల్‌.అప్పారావు కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకొని అనురాధ నివాసముంటోంది. ప్రస్తుతం కుమార్తె దివ్య ఓ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. దీంతో అనురాధ ఒంటరిగానే నివాసముంటోంది. శుక్రవారం మధ్యాహ్నం అనురాధ తల్లి అమ్ముడమ్మ ఇంటి వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. దీంతో ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని భావించి తిరిగి నందగిరిపేట వెళ్లిపోయింది. రాత్రి వరకూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుండడం, తెలిసిన వారి వద్ద ఆరాతీసినా ఆచూకీ లేకపోవడంతో  తల్లి అమ్ముడమ్మకు అనుమానం వచ్చింది. కుటుంబసభ్యుల సాయంతో శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఆమదాలవలసలోని అనురాధ ఇంటి వద్దకు చేరుకుంది. పరిసరాలను పరిశీలించగా తాళం చెవి కనిపించింది. వెంటనే తాళం తీసి చూడగా గదిలో రక్తపుమడుగులో అనురాధ కనిపించింది. ముఖం, మెడ, గొంతుపై కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన పోలీసులకు అక్కడకు చేరుకున్నారు. హత్యగా నిర్థారించారు. శనివారం ఉదయం ఘటనాస్థలాన్ని డీఎస్పీ మహేంద్ర పరిశీలించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు వేలిముద్రలు సేకరించారు. డాగ్‌స్వ్కాడ్‌ సైతం పరిశీలించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మృతురాలు అనురాధ ఇటీవలే తిమ్మాపురంలో ఇల్లు కొనుగోలు చేసింది. ఆదివారం గృహ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే అఘాయిత్యం జరిగింది. ఆమె హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? లేకుంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను కలిసేందుకు తరచూ కొంతమంది వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు.


Read more