మా వాళ్లపైనే సారా కేసులు రాస్తావా?

ABN , First Publish Date - 2022-09-25T05:02:47+05:30 IST

‘సారా పట్టుకుని మావాళ్లపైనే కేసులు రాస్తావా? ఇంతకీ నేనెవరో తెలుసా? మీరే కొత్త. నా గురించి తెలుసుకోండి’ అంటూ ఓ వైసీపీ నాయకుడు ఎక్సైజ్‌ ఎస్‌ఐపై చిందులు తొక్కారు. శనివారం జరిగిన కవిటి మండల సర్వసభ్య సమావేశంలోనే.. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలోనే ఆ నాయకుడు రెచ్చిపోయారు.

మా వాళ్లపైనే సారా కేసులు రాస్తావా?
ఎక్సైజ్‌శాఖ ఎస్‌ఐపై చిందులు తొక్కుతున్న నాయకులు

మీపై అధికారులతో నాకు సత్సంబంధాలు
ఎక్సైజ్‌ ఎస్‌ఐపై వైసీపీ నాయకుడి చిందులు
కవిటి, సెప్టెంబరు 24:
‘సారా పట్టుకుని మావాళ్లపైనే కేసులు రాస్తావా? ఇంతకీ నేనెవరో తెలుసా? మీరే కొత్త. నా గురించి తెలుసుకోండి’ అంటూ ఓ వైసీపీ నాయకుడు ఎక్సైజ్‌ ఎస్‌ఐపై చిందులు తొక్కారు. శనివారం జరిగిన కవిటి మండల సర్వసభ్య సమావేశంలోనే.. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలోనే ఆ నాయకుడు రెచ్చిపోయారు. ఇంత జరిగినా ఏఒక్కరూ పట్టించుకోలేదు. శాఖలవారీగా సమీక్షలో భాగంగా ఎక్సైజ్‌శాఖ ఎస్‌ఐ ఎస్‌.ముసలినాయుడు మాట్లాడుతుండగా వైసీపీ నాయకుడు మైకు పట్టుకుని లేచారు. ‘నేనెవరో తెలుసా? మీ డిపార్ట్‌మెంట్‌తో నాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. మీరు కొత్తగా వచ్చారు. నా గురించి తెలుసుకోండి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ‘మీపై స్థాయిలో డీసీ రేంజ్‌ అధికారులతో నాకు సంబంధాలు ఉన్నాయి. కేసులు కట్టాలి అనుకుంటే నాతో రండి పట్టిస్తా. మీ డిపార్ట్‌మెంట్‌కు నా వాహనాలే పెట్టాను తెలుసుకోండి’ అని రంకెలు వేశారు. దీనికి ఎస్‌ఐ స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సారా విక్రయాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని, మాకు ఎవరిపైనా కక్షలు లేవని చెప్పారు.

 

Read more