టీడీపీలోనే ఉంటా

ABN , First Publish Date - 2022-09-20T05:18:28+05:30 IST

సహాయం కోసం వెళితే వైసీపీ కండువా వేసి వైసీపీ పార్టీలో చేరినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటన లిచ్చారని, అయితే తాను పార్టీ మారలేదని, టీడీపీ లోనే ఉంటానని రెయ్యిపాడు ఎంపీటీసీ సభ్యుడు సూళ్ల చిట్టిబాబు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం పూండిలో మాజీ ఎంపీపీ గొరకల వసంతస్వామి ఇంటి వద్ద టీడీపీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

టీడీపీలోనే ఉంటా
విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీటీసీ చిట్టిబాబు

ఎంపీటీసీ సభ్యుడు సూళ్ల చిట్టిబాబు

వజ్రపుకొత్తూరు: సహాయం కోసం వెళితే వైసీపీ కండువా వేసి వైసీపీ పార్టీలో చేరినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటన లిచ్చారని, అయితే తాను పార్టీ మారలేదని, టీడీపీ లోనే ఉంటానని  రెయ్యిపాడు ఎంపీటీసీ సభ్యుడు సూళ్ల చిట్టిబాబు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం పూండిలో మాజీ ఎంపీపీ గొరకల వసంతస్వామి ఇంటి వద్ద టీడీపీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17న తనకు చెందిన ట్రాక్టర్‌ను ఇసుక లోడ్‌తో ఫారెస్టు అధికారులు పట్టు కొని రూ.2 లక్షలకు పైగా అపరాధ రుసుం విధించారని ఆందో ళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేతలు మంత్రి వద్దకు వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో కాశీబుగ్గలోని మంత్రి కార్యాలయానికి వెళ్లానని, అయితే వైసీపీ కండువా వేసి తాను ఆ పార్టీలో చేరినట్లు వారి అనుకూల పత్రికలు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంటి నుంచి బయటకు రాలేక పోయానన్నారు. నేను ఏ పార్టీలో చేరలేదని, టీడీపీ ఎంపీటీసీ గానే ఉంటానని, ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే కొనసాగు తానన్నారు. కార్యక్రమంలో నాయకులు పి.విఠల్‌, బి.శశిభూషణ్‌, ఎస్‌.మోహనరావు, ఎ.ఉమామహేశ్వరరావు, డి.జేజే రావు, ఎం.ధుర్యోధనరెడ్డి, రెల్ల దానయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Read more