జిల్లాకు ‘కింజరాపు’ సోదరులు చేసిందేమిటి?

ABN , First Publish Date - 2022-11-24T23:36:47+05:30 IST

జిల్లా అభివృద్ధికి కింజరాపు సోదరులు చేసిందేమిటని, కేవలం ఉపన్యాసాలు తప్ప వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

జిల్లాకు ‘కింజరాపు’ సోదరులు చేసిందేమిటి?

పలాసరూరల్‌: జిల్లా అభివృద్ధికి కింజరాపు సోదరులు చేసిందేమిటని, కేవలం ఉపన్యాసాలు తప్ప వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస మండలం బ్రాహ్మణతర్లాలో గురువారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం జిల్లాను పాలించిన టీడీపీ నేతలు వారి వ్యాపారాలు, పరపతి కోసం తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. టీడీపీ కాలంలో కింజరాపు అచ్చెన్నాయుడు అనధికారికంగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌లు పెట్టడంతో వంశధార శివారు భూములకు సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం గ్రామవీధుల్లో తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు.

Updated Date - 2022-11-24T23:36:47+05:30 IST

Read more