ఇళ్ల బిల్లులివ్వక ఇబ్బందులు పడుతున్నాం

ABN , First Publish Date - 2022-05-18T05:35:18+05:30 IST

సొంత స్థలంలో నిర్మించుకున్న ఇళ్లకు హౌసింగ్‌ బిల్లులు మంజూరుచేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. ముద్దాడ పంచాయతీ అంబేడ్కర్‌ నగర్‌, చిన కొయ్యవానిపేట, సెగిడిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మంగళవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు తమ ఇబ్బందులను ఆ యన దృష్టికి తీసుకువెళ్లారు.

ఇళ్ల బిల్లులివ్వక ఇబ్బందులు పడుతున్నాం
చిన కొయ్యవానిపేటలో ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కు సమస్యలు తెలుపుతున్న మహిళ


 ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ ఎదుట గ్రామస్థుల ఆవేదన

ఎచ్చెర్ల: సొంత స్థలంలో నిర్మించుకున్న ఇళ్లకు హౌసింగ్‌ బిల్లులు మంజూరుచేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. ముద్దాడ పంచాయతీ అంబేడ్కర్‌ నగర్‌, చిన కొయ్యవానిపేట, సెగిడిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మంగళవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు తమ ఇబ్బందులను ఆ యన దృష్టికి తీసుకువెళ్లారు. ఇళ్లు మంజూరైనా బిల్లు లివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలను కలుపుతూ ఉన్న రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటిని బాగు చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మొదలవలస చిరంజీవి, జడ్పీటీసీ బల్లాడ హేమమాలిని, ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాడుగుల రూపా వతి, సర్పంచ్‌ ఎం.శంకరరావు, మాజీ ఎంపీటీసీ బెండు రామారావు, వైసీపీ నేతలు జరుగుళ్ల శంకరరావు, సనపల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 

Read more