ఘనంగా వల్లభ నారాయణ స్వామి ఉత్సవం
ABN , First Publish Date - 2022-01-17T05:00:30+05:30 IST
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదివారం రట్టి వల్లభనారాయణ స్వామి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. హరిపురం, బాలిగాం, డబారు, ఉమాగిరి తదితర గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. రట్టి ఆలయం నుంచి పట్టువస్త్రాలు, ప్రత్యేక అలంకరణతో కోలాటం, డప్పు వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలు నడుమ స్వామికి తిరువీధి నిర్వహించారు.
హరిపురం: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదివారం రట్టి వల్లభనారాయణ స్వామి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. హరిపురం, బాలిగాం, డబారు, ఉమాగిరి తదితర గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. రట్టి ఆలయం నుంచి పట్టువస్త్రాలు, ప్రత్యేక అలంకరణతో కోలాటం, డప్పు వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలు నడుమ స్వామికి తిరువీధి నిర్వహించారు. ప్రత్యే క పూజలను ఆలయ అర్చకులు రట్టి సీతారాం, ప్రహాదు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. హరిపురంలో పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. హరిపురం నుంచి బాలిగాం, డబారు, పుచ్చపాడు, ఉమాగిరి, మందస గ్రామాల నుంచి తిరువీధిగా స్వామిని మందస రాజావారీ కోటకు తీసుకువచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసి రట్టి ఆలయానికి చేర్చారు.