రెండు లారీలు ఢీ.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2022-03-06T05:18:52+05:30 IST

బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.

రెండు లారీలు ఢీ.. ఇద్దరికి గాయాలు
రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన నూనె ప్యాకెట్లు:

 రూ.5లక్షల విలువ చేసే వంటనూనె రోడ్డు పాలు

లావేరు, మార్చి 5:  బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన  ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరా ల్లోకి వెళ్తే.. విశాఖప ట్నం నుంచి శ్రీకాకు ళం వైపు వంట నూనె ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న లారీని అదే మార్గంలో చేపల లోడుతో వెనుకన వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ సాయి, మున్నలకు స్వల్పగాయాలయ్యాయి. ముందు లారీలో ఉన్న వంట నూనె ప్యాకెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సుమారు రూ.5 లక్షల విలువగల నూనె రోడ్డు పాలయ్యింది.  లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 


Updated Date - 2022-03-06T05:18:52+05:30 IST