రైలు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-12-31T23:48:54+05:30 IST

జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రైలు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. పొందూరు మండలం లైదాం రైల్వేగేటు సమీపంలో తుంగపేట వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి ఒంటిపై నీలంరంగు టీషర్టు, లుంగీ ఉన్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.

 రైలు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

పొందూరు/లావేరు/ఆమదాలవలస: జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రైలు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. పొందూరు మండలం లైదాం రైల్వేగేటు సమీపంలో తుంగపేట వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి ఒంటిపై నీలంరంగు టీషర్టు, లుంగీ ఉన్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్ట్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించా మన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 7013273731 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. కాగా, మృతి చెందింది లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కింతాడ అప్పారావు (51)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇతను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ పరిధి రైల్వే అంతర్గత మార్గం సమీపంలో రైలు నుంచి జారిపడి చత్తీష్‌గడ్‌ రాష్ట్రం రామ్‌నగర్‌కు చెందిన గోపీ ప్రశాంత్‌ సాహూ(28) అనే యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T23:48:54+05:30 IST

Read more