క్రీడలతో ఉన్నత స్థాయికి
ABN , First Publish Date - 2022-12-16T23:21:13+05:30 IST
యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థా నాలకు చేరుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అన్నారు.
- కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్
- జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు
అరసవల్లి: యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థా నాలకు చేరుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జోనల్ స్థాయి సీఎంకప్ ప్రైజ్మనీ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో కూడిన సాధన చేస్తే గొప్ప ఫలితాలు సాధించవచ్చన్నారు. సచిన్, కోహ్లి వంటి క్రీడాకారులు తక్కువ చదువుకున్నా క్రీడల్లో సత్తా చాటి ప్రపంచ స్థాయికి ఎదిగారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ టోర్నమెంట్లో శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల నుంచి 17 ఏళ్ల వయసు పైబడిన మహిళా, పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత క్రీడాస్ఫూర్తితో ఉత్తమ ప్రదర్శన చేస్తామని క్రీడాకారులతో కలెక్టర్ ప్రమాణం చేయిం చారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన టీమ్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధా న్యం ఇస్తున్నాయని, ఈ అవకాశాలను క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ ప్రసాదరావు, జిల్లా చీఫ్కోచ్ మాధురీలత, ఆరు జిల్లాలకు చెందిన క్రీడా ప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు.