వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-03-05T05:53:59+05:30 IST

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

నందిగాం, మార్చి 4 : జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆ వివరాలు పరిశీలిస్తే... నందిగాం మండలం పెద్దబాణాపురం సమీపంలో హైవేపై గురువారం అర్థరాత్రి ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ అంబటి రాజేశ్వరరావు(42) మృతి చెందాడు. మెటల్‌ లోడ్‌ను ట్రాక్టర్‌ పలాస వైపు అర్ధరాత్రి వేళ తీసుకువెళ్తుండగా అదే మార్గంలో వెనుక నుంచి  లారీ వచ్చి బలంగా ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌ బోల్తాపడి రాజేశ్వరరావుకు తీవ్రగా యాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో  పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించడంతో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు పవన్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహ్మద్‌యా సిన్‌ తెలిపారు.  

- ఆమదాలవలస : ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్‌) రైల్వేస్టేషన్‌ మూడో నెంబర్‌ ప్లాట్‌ఫాం ట్రాక్‌పై శుక్రవారం రైలు ఢీకొని  మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన తంగుడు రత్నాలమ్మ(45) అనే మహిళ మృతి చెందింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రత్నాలమ్మ, ఆమె భర్త శివకుమార్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ దిగారు. రెండో నెంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు ట్రాక్‌ దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి పలాస వైపు వెళ్తున్న సూపర్‌ ఫాస్టు రత్నాలమ్మను ఢీకొంది. దీంతో ఆమె ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.  రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దూసి- ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ల మధ్య కణుగులవలస సమీపంలో డౌన్‌లైన్‌పై శుక్రవారం  రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.  మృతురాలు పచ్చరంగు చీర, కాళ్లకు పట్టీలు, మట్టిలు ధరించి ఉంది. వయుసు సుమారు  35 ఏళ్లు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.  

Read more