వారినికోసారైనా నీరివ్వడం లేదు

ABN , First Publish Date - 2022-12-31T23:48:55+05:30 IST

టీడీపీ హయాంలో 2014లో పట్టణంలో ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేశామని, అయితే ప్రస్తుతం వారానికి ఒకసారి కూడా నీరందించని పరిస్థితి నెలకొందని టీడీపీ కౌన్సిలర్లు గురిటి సూర్య నారాయణ, వజ్జ బాబూరావు ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్‌ బల్ల గిరిబాబు అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.

వారినికోసారైనా నీరివ్వడం లేదు

పలాస, డిసెంబరు 31: టీడీపీ హయాంలో 2014లో పట్టణంలో ప్రతిరోజూ తాగునీటి సరఫరా చేశామని, అయితే ప్రస్తుతం వారానికి ఒకసారి కూడా నీరందించని పరిస్థితి నెలకొందని టీడీపీ కౌన్సిలర్లు గురిటి సూర్య నారాయణ, వజ్జ బాబూరావు ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్‌ బల్ల గిరిబాబు అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. రూ. లక్షలు వ్యయం చేస్తున్నా ఎం దుకు నీరందించలేకపోతున్నారని ప్రశ్నించారు. పట్టణంలో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఒక్క కాలు వను కూడా శుభ్రం చేసే పరిస్థితి లేదని, పర్యవేక్షణ కొరవడుతోం దని విమర్శించారు. పట్టణంలోనే 550 పింఛన్లను రద్దు చేశా రని, బాధితుల ఉసురు తగులుతుందని ఆక్షేపించారు. దీని పై చైర్మన్‌ గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఒక సారి సర్వే చేసి లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతుల ద్వారా పింఛ న్లు ఇవ్వడం జరుగుతుందని, తొలగించిన వాటిని పునః పరి శీలించి అర్హత ఉన్న వారికి పింఛన్లు పునరుద్ధరిస్తామన్నారు. సమావేశంలో కమిషనర్‌ టి.రాజగోపాలరావు, ఏడీఈ ఐ. హరికృష్ణ, వైస్‌ చైర్మన్లు బోర కృష్ణారావు, మీసాల సురేష్‌ బాబు, కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:48:56+05:30 IST