కార్మిక హక్కులు కాలరాస్తే సహించేది లేదు

ABN , First Publish Date - 2022-12-30T00:04:46+05:30 IST

కార్మిక హక్కులను కాలరాస్తే సహించేది లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర కార్మిక చైతన్య బస్‌ యాత్రను రెండో రోజు రణస్థలం నుంచి ప్రారంభించారు.

కార్మిక హక్కులు కాలరాస్తే సహించేది లేదు
మాట్లాడుతున్న నర్సింగరావు

రణస్థలం: కార్మిక హక్కులను కాలరాస్తే సహించేది లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర కార్మిక చైతన్య బస్‌ యాత్రను రెండో రోజు రణస్థలం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మా ర్చేందుకు కార్మిక చట్టాలు మార్చేస్తుందన్నారు. అరబిందో యాజమాన్యాం రాష్ట్ర ప్రభుత్వం అండచూసుకుని వేతన ఒప్పందం చేయకుం డా ఏకపక్షంగా వ్యవహ రిస్తుందని విమర్శించారు. శ్యామ్‌పిస్టన్స్‌, యునెటెడ్‌ బ్రేవరీస్‌ కార్మికులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగు ణంగా కార్మికుల వేతనాలు పెంచాలన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికు లు చాలీచాలని వేతనాలతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సీహెచ్‌ అమ్మన్నాయుడు. పి.తేజేశ్వరావు, కె.గురునాయుడు, ఎల్‌.రాంబాబు తదిరతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:04:46+05:30 IST

Read more