-
-
Home » Andhra Pradesh » Srikakulam » The YCP government should be strengthened-MRGS-AndhraPradesh
-
వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
ABN , First Publish Date - 2022-09-09T04:46:39+05:30 IST
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండా లని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. కొమ్ముసరియాపల్లిలో గురువారం ‘బాదుడే బాదుడు’ నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
సారవకోట (జలుమూరు): ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండా లని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. కొమ్ముసరియాపల్లిలో గురువారం ‘బాదుడే బాదుడు’ నిర్వహించారు. ఈ సంద ర్భంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసే కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. నవరత్నాలు పేరిట అన్నివర్గాల ప్రజలను నయవంచనచేసి నట్టేట ముంచారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు పేరిట రాష్ట్రాన్ని దోచుకొని అప్పులు ఊబిలోకి నెట్టి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేసి పాతపెన్షను విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగా నే దానిని మరిచిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబుబు నాయకత్వాన్ని బలపరచి టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు ధర్మాన తేజకుమార్, సురవరపు తిరుపతిరావు, సాధు చిన్నికృష్ణంనాయుడు, ఇ.నాగరాజు, పట్ట ఉమారావు, బైరి భాస్కరరావు, బగ్గు గోవిందరావు తదిత రులు పాల్గొన్నారు.