హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-12-07T00:03:15+05:30 IST
పోలీసు శాఖలో కీలకమైన హోంగార్డుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైనా యుద్ధం తర్వాత పోలీసులతో సమానంగా కలిసి పనిచేసేందుకు హోంగార్డు వ్యవస్థ స్వచ్ఛందంగా ఆవిర్భవించిందని చెప్పారు.
హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం
ఎస్పీ జీఆర్ రాధిక
ఎచ్చెర్ల, డిసెంబరు 6: పోలీసు శాఖలో కీలకమైన హోంగార్డుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైనా యుద్ధం తర్వాత పోలీసులతో సమానంగా కలిసి పనిచేసేందుకు హోంగార్డు వ్యవస్థ స్వచ్ఛందంగా ఆవిర్భవించిందని చెప్పారు. జిల్లాలో 1965లో ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా 739 మంది సేవలందిస్తున్నారని తెలిపారు. వారికి ఇచ్చే గౌరవ వేతనం తక్కువైనప్పటికీ పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారని పేర్కొ న్నారు. కమాండర్ శశికుమార్ ఆధ్వర్యంలో హోంగార్డులు పరేడ్ నిర్వహిం చగా.. ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. తొలుత శాంతికి చిహ్నంగా పావురాన్ని ఎస్పీ విడిచిపెట్టారు. కార్యక్రమంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జేడీ వీఎన్ మణికంఠ, అదనపు ఎస్పీ టీపీ విఠ లేశ్వరరావు, డీఎస్పీలు ఎస్.బాలరాజు, జి.శ్రీనివాసరావు, సీహెచ్.ప్రసాదరావు, ఆర్‌ఐలు ప్రదీప్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.