శుభకార్యానికి వచ్చి..

ABN , First Publish Date - 2022-06-12T05:55:22+05:30 IST

అంతవరకూ బంధువుల సందడితో కళకళలాడిన ఆ ఇంట.. ఒక్కసారిగా విషాదం అలుముకుంది. విశాఖపట్నం జిల్లా నుం చి రణస్థలం మండలంలో ఓ శుభకార్యానికి బం ధువుల ఇంటికి వచ్చి.. సరదాగా తీరప్రాంతానికి వెళ్లిన ముగ్గురు సముద్రంలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభించక పోవడంతో కుటుం బ సభ్యులు, బంధువు లు ఆందోళన చెందుతున్నారు.

శుభకార్యానికి వచ్చి..
సముద్రంలో గల్లంతైన గణేష్‌, దీవెన, మానస (ఫైల్‌)

 తీరంలో ముగ్గురు గల్లంతు

 సముద్ర స్నానం చేస్తుండగా ఘటన

 రణస్థలం మండలంలో విషాదం

 బాధితులది విశాఖ జిల్లా 

రణస్థలం, జూన్‌ 11: అంతవరకూ బంధువుల సందడితో కళకళలాడిన ఆ ఇంట.. ఒక్కసారిగా విషాదం అలుముకుంది. విశాఖపట్నం జిల్లా నుం చి రణస్థలం మండలంలో ఓ శుభకార్యానికి బం ధువుల ఇంటికి వచ్చి.. సరదాగా తీరప్రాంతానికి వెళ్లిన ముగ్గురు సముద్రంలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభించక పోవడంతో కుటుం బ సభ్యులు, బంధువు లు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రణస్థలం మండలం పోతయ్యవలస సముద్ర తీరం లో విశాఖపట్నం జిల్లా బీమునిపట్నం మండలం కె.నగరపాలెం గ్రామానికి చెందిన తిరుపతి గణేష్‌ (33), ఈయన కుమార్తె మానస(9),  మేనకోడలు వానమామల దీవెన(18)లు గల్లంతయ్యారు. దీవెన ది వడ్డాది మండలం మాడుగుల గ్రామం. ఈ ముగ్గురూ శనివారం రణస్థలం మండలం రామ చంద్రాపురంలోని ఓ శుభకార్యానికి వచ్చారు. గణేష్‌, దీవెన శనివారం రాగా.. మానస తన తల్లితో నాలుగు రోజుల కిందటే రామచంద్రాపురం వచ్చిం ది. వీరితో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి సరదాగా పోతయ్యవలస సముద్ర తీరానికి వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా.. అలల ఉధృతికి గణేష్‌, మానస, దీవెన లు గల్లంతయ్యారు. స్థానికులు కేకలు వేయడంతో.. వెంటనే మత్స్యకారులు సముద్రంలోకి దిగి వారి కోసం గాలించారు. సమాచారం తెలిసి పోలీసులు కూడా తీరప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయా రు. ఆ ముగ్గురూ ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని దేవుడ్ని వేడుకుంటున్నారు. మత్స్యకా రుల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశా మని రణస్థలం ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపారు. 

Read more