ప్రజా వంచన పాలనకు ముగింపు పలకాలి

ABN , First Publish Date - 2022-11-18T23:51:20+05:30 IST

రాష్ట్రంలో ప్రజావంచన పాలనకు ముగింపు పలికాలని టీడీపీ నాయకుడు కోళ్ల అప్పలనాయుడు తెలిపారు.

ప్రజా వంచన పాలనకు  ముగింపు పలకాలి
పుల్లిటలో ర్యాలీగా నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు:

సంతకవిటి: రాష్ట్రంలో ప్రజావంచన పాలనకు ముగింపు పలికాలని టీడీపీ నాయకుడు కోళ్ల అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం మామిడిపల్లి, పుల్లిటలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు పెరగడంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండ లాధ్యక్షుడు గట్టి భాను, నాయకులు మొయ్యి నారాయణప్పడు, వల్లూరు గణేష్‌, చెలికాన మహేష్‌బాబు, త్రినాథరావు, బొడ్డేపల్లి సూర్యనారాయణ పాల్గొన్నారు.

నేడు మండల టీడీపీ సమావేశం

లక్కవరపుకోట: మండలంలోని గనివాడ వెళ్లే మార్గంలో టీడీపీ కార్యకర్తల సమావేశం ఆదివారం జరగనుందని పార్టీ మండలాధ్యక్షుడు చొక్కాకుల మల్లునాయుడు ఒక ప్రకనటలో తెలిపారు. ఈ సమావేశానికి కార్యకర్తలంతా హాజరుకావాలని కోరారు.

Updated Date - 2022-11-18T23:51:20+05:30 IST

Read more