రైతు సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-16T23:27:10+05:30 IST

రైతు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని, సీఎం జగన్‌రెడ్డి పత్రికా ప్రకటనలకు, ప్రసంగా లకే పరిమితం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ.. మాండస్‌ తుఫాన్‌ వల్ల వివిధ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని తక్షణం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతు సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వం
అచ్చెన్నాయుడుతో టీడీపీ నాయకులు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టెక్కలి, డిసెంబరు 16: రైతు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని, సీఎం జగన్‌రెడ్డి పత్రికా ప్రకటనలకు, ప్రసంగా లకే పరిమితం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ.. మాండస్‌ తుఫాన్‌ వల్ల వివిధ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని తక్షణం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని అంచ నా వేయాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితు లకు ప్రభుత్వం నయా పైసా సాయం అందించలేదని ఆరోపించారు. ఇళ్లు కొట్టుకు పోయి కట్టుబట్టలతో నడిరోడ్డున పడిన కుటుంబాలకు ఆశ్రయం కల్పించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవ సాయరంగం సంక్షోభంలోకి కూరుకు పోయిందన్నారు. బీసీ కార్పొ రేషన్ల చైర్మన్లు ఉత్సవ విగ్రహాల్లా మారారని, పైసా బడ్జెట్‌ కేటాయించకుండా కార్పొరేషన్ల కాళ్లు విరిచారని విమర్శించారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా గతంలో రూ.6 వేల కోట్ల రుణాలిచ్చామని, బీసీ యువతకు ఉపాధి, ఉద్యోగాల్లో మెరుగైన భవిష్యత్‌ కల్పించామన్నారు. బీసీలు అంటే ఓట్లు మాత్రమే అనే దుస్థితికి జగన్‌ తీసుకువచ్చారని దుయ్యబట్టారు.

అచ్చెన్నాయుడును కలిసిన పలువురు నేతలు

కోటబొమ్మాళి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును శుక్రవారం కోటబొమ్మాళి, టెక్కలి, నరసన్న పేట, సంతబొమ్మాళి మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలిసి స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. కురుడు పంచాయతీ పాకివలసకి చెందిన టీడీపీ సీని యర్‌ నాయకుడు చింతల సింహాచలం ఆయనను కలిసి గ్రామ సమస్యలతో పాటు ఎస్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

Updated Date - 2022-12-16T23:27:11+05:30 IST