రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి

ABN , First Publish Date - 2022-01-13T05:59:11+05:30 IST

ప్రతిఒక్కరూ రైతు ఆత్మగౌ రవాన్ని నిలబెట్టాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కోరారు.

రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి
మాట్లాడుతున్న జయకృష్ణ:


పాలకొండ: ప్రతిఒక్కరూ రైతు ఆత్మగౌ రవాన్ని  నిలబెట్టాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కోరారు. బుధవారం పాలకొండలో అఖిలపక్ష రైతు సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుడితి అప్పలనాయుడు అధ్యక్షతన నిరసన దీక్ష  నిర్వహించారు.  దీక్షకు  జయకృష్ణ సంఘీ భావం తెలిపారు.దీక్షలో జడ్పీటీసీ సభ్యుల రాష్ట్ర అధ్యక్షుడు ఆనెపురామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, జనసేన  నాయకులు గర్భాన సత్తిబాబు, టీడీపీ నాయకులు గుమ్మిడి సింహాద్రి, కనపాక చౌదరినాయుడు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.


Updated Date - 2022-01-13T05:59:11+05:30 IST