కుటుంబ కలహాలతో ఉపాధ్యాయుడి ఆత్యహత్య
ABN , First Publish Date - 2022-01-13T05:58:21+05:30 IST
కుటుంబ కలహాలతో ఓఉపాధ్యాయుడు ఆత్యహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం రూరల్ మండలం ఇందిరానగర్ కాలనీలో బుధ వారం చోటుచేసుకుంది.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 12: కుటుంబ కలహాలతో ఓఉపాధ్యాయుడు ఆత్యహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం రూరల్ మండలం ఇందిరానగర్ కాలనీలో బుధ వారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గార జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అలికాన చెంచునాయుడు(43) కుటుంబంతో సహా శ్రీకాకుళానికి ఆనుకుని ఉన్న ఇందిరానగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ నివసిస్తున్నాడు. భార్య అలికాన అనూరాధ శానివాడ ఎమ్పీపీ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచే స్తున్నారు. వీరికి పదో తరగతి, ఎనిమిదో తరగతి చదువుతు న్న ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం కూడా గొడవపడ్డారు. దీంతో చెంచునాయుడు తన గదిలోకి వెళ్లి తలుపువేసుకున్నాడు. గంటసేపు అయినా ఆయన బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో కుటుంబ సభ్యులు తలుపు తెరిచారు. లోపల చెంచునాయుడు ఉరివేసుకుని వేళాడుతూ కనిపించాడు. వెంటనే 108వాహనానికి, శ్రీకాకుళం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. భార్య అనూరాధ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.