ఊసవానిపేటలో టీడీపీ మాటామంతి

ABN , First Publish Date - 2022-12-31T23:45:03+05:30 IST

‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా మహిళలందరికీ పసుపు కుంకుమ కింద నగదు అందించేవారు. కానీ జగన్‌ సీఎం అయ్యాక 45 ఏళ్లు నిండిన మహిళలకే ఆర్థిక సాయం అందిస్తున్నారు.’ అని పురపాలక సంఘం పరిధి 3వ వార్డు ఊసవానిపేట గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఊసవానిపేటలో టీడీపీ మాటామంతి

ఆమదాలవలస: ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా మహిళలందరికీ పసుపు కుంకుమ కింద నగదు అందించేవారు. కానీ జగన్‌ సీఎం అయ్యాక 45 ఏళ్లు నిండిన మహిళలకే ఆర్థిక సాయం అందిస్తున్నారు.’ అని పురపాలక సంఘం పరిధి 3వ వార్డు ఊసవానిపేట గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ నాయకురాలు, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత ఆద్వర్యంలో శనివారం ఊసవానిపేటలో ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పాలన తేడాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, పట్టణ మహిళా అధ్యక్షురాలు బోయిన సునీత, పట్టణ అధ్యక్షుడు సంపతరావు మురళీరావు, తెలుకల కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఇంజరాపు విశ్వనాథం, రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:45:03+05:30 IST

Read more