వైసీపీ పాలనలో పన్నుల భారం
ABN , First Publish Date - 2022-10-08T05:02:12+05:30 IST
వైసీపీ పాలనలో పన్నుల భారం
- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
హరిపురం: వైసీపీ పాలనలో పన్నుల భారంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇన్చార్జి గౌతు శిరీష విమర్శించారు. మందస మండలం సొండిపూడి, హంసరాలి పంచాయతీల పరిధిలో పార్టీ మండల అధ్యక్షుడు భావన దుర్యోధన ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బాదుడే-బాదుడులో శిరీష పాల్గొని మాట్లాడారు. ఉప్పు,పప్పు, నూనె నుంచి విద్యుత్, బస్సు ఛార్జీల వరకు అన్నింటిపైనా ప్రభుత్వం జే-ట్యాక్స్ విధించి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజా వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో పీరుకట్ల విఠల్, జీకే నాయుడు, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, దాసరి తాతారావు, తమిరియా భాస్కరరావు, తాతయ్య తదితరులు పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పలాస: రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర శ్రీశయన సాధికార కమిటీ కన్వీనర్‌గా నియమితులైన ఏలూరుకు చెందిన పట్నాల వెంకటేష్‌బాబు, రజక సాధికార కమిటీ జిల్లా కన్వీనర్‌గా ఎంపికైన కొవ్వూరు సురేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం శిరీషను స్థానిక పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.