-
-
Home » Andhra Pradesh » Srikakulam » Suspected dengue case in Venkaiahpet-NGTS-AndhraPradesh
-
వెంకయ్యపేటలో డెంగ్యూ అనుమానిత కేసు
ABN , First Publish Date - 2022-06-07T06:09:35+05:30 IST
మునిసిపాలిటీ పరిధిలో గల 23వ వార్డు వెంకయ్యపేటలో డెంగ్యూ అనుమానిత కేసు నమోదయ్యింది. గ్రామానికి చెందిన వాన లక్ష్మి కొద్దిరోజులుగా జ్వరంతో బాదపడుతోంది. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆమదాలవలస: మునిసిపాలిటీ పరిధిలో గల 23వ వార్డు వెంకయ్యపేటలో డెంగ్యూ అనుమానిత కేసు నమోదయ్యింది. గ్రామానికి చెందిన వాన లక్ష్మి కొద్దిరోజులుగా జ్వరంతో బాదపడుతోంది. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి, డెంగ్యూగా గుర్తించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది కాలువలో పూడికలు తొలగించి, పారిశుధ్య పనులు నిర్వహించినట్లు ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ బి.సృజన తెలిపారు. స్వయం సహాయ సంఘాల ఆర్పీగా పని చేస్తున్న వాన లక్ష్మికి స్వల్ప డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారని ఏఎన్‌ఎం పి.తులసీబాయ్ ఆంధ్రజ్యోతికి తెలిపారు.