మమ్మల్ని ఆదుకోండి

ABN , First Publish Date - 2022-09-27T04:57:46+05:30 IST

‘భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పేరుతో అన్యాయం జరుగుతోంది. రఘునాథపురం నుంచి రాజపురం వరకు వంద మీటర్ల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేస్తే మా బతుకులు పోతాయి. మమ్మల్ని ఆదుకోండి’ అంటూ బాధిత రైతులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

మమ్మల్ని ఆదుకోండి
అచ్చెన్న వద్ద గోడు వినిపిస్తున్న రైతులు

అచ్చెన్నకు ‘భావనపాడు’ బాధిత రైతుల విజ్ఞప్తి
టెక్కలి, సెప్టెంబరు 26:
‘భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పేరుతో అన్యాయం జరుగుతోంది. రఘునాథపురం నుంచి రాజపురం వరకు వంద మీటర్ల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేస్తే మా బతుకులు పోతాయి. మమ్మల్ని ఆదుకోండి’ అంటూ బాధిత రైతులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం టెక్కలి మండలం బన్నువాడ, మోదుగువలస, తలగాం, విశ్వనాథపురం గ్రామాలకు చెందిన  పలువురు రైతులు కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అచ్చెన్నను కలిశారు. ‘భావనపాడు పోర్టుకు సంబంధించి నాలుగైదు రహదారి మార్గాలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చివరకు రఘునాథపురం నుంచి రాజపురం మార్గాన్ని సూచించారు. రోవర్స్‌తో సర్వేలు చేస్తున్నారు. ఈ మార్గంలో రోడ్డు వెడల్పు చేస్తే.. భూములు కోల్పోతాము’ అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట.. తమ కడుపులు కొడుతోందని వాపోయారు. తమకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో వట్టికూళ్ల తిరుమలరావు, మోహన్‌, దుర్గారావు, స్వతంత్రరావు తదితరులు ఉన్నారు.

 

Read more