చదువుకు ‘ఆట’ంకం

ABN , First Publish Date - 2022-12-30T00:12:32+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో వైసీపీకి చెందిన ఓ చోటా నాయకుడు సంక్రాంతి సంబరాలపేరిట నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలకు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారాయి. ఎటువంటి అనుమతులు, నిబంధనలు లేకుండా ఈ మైదానంలో ఆటలు నిర్వహిస్తున్నారు.

చదువుకు ‘ఆట’ంకం
క్రికెట్‌ పోటీలు జరుగుతున్న దృశ్యం

ఆమదాలవలస: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో వైసీపీకి చెందిన ఓ చోటా నాయకుడు సంక్రాంతి సంబరాలపేరిట నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలకు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారాయి. ఎటువంటి అనుమతులు, నిబంధనలు లేకుండా ఈ మైదానంలో ఆటలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు భోగి వరకు జరగనున్నాయి. మైదానానికి ఆనించి ఉన్న భవనాల్లో 7,8,9 తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన ఆ చోటా నాయకుడి గ్యాంగ్‌ అక్కడే విందు, వినోదాలతో మునిగి తేలుతున్నారు. అలాగే, ఇష్టం వచ్చినట్లు మైక్‌లో క్రికెట్‌ కామెంటరీ చేస్తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై పాఠశాల హెచ్‌ఎం, ఇన్‌చార్జి ఎంఈవో డి.రామారావు మాట్లాడుతూ.. క్రికెట్‌ పోటీల నిర్వహణకు మైదానంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. అయినా పోటీల వల్ల అసౌకర్యంగా లేదన్నారు.

Updated Date - 2022-12-30T00:12:34+05:30 IST