రేపటి నుంచి శ్రీముఖలింగేశ్వరుడి కల్యాణ వేడుకలు

ABN , First Publish Date - 2022-06-08T05:18:54+05:30 IST

రీముఖలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం ధ్వజారోహణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం పీని మన్ను తేవడం, శతుమానం బంగారం, కొట్నందంపు, స్వామివారి ఉత్సవమూర్తులను

రేపటి నుంచి శ్రీముఖలింగేశ్వరుడి కల్యాణ వేడుకలు
శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయం


ఐదు రోజుల పాటు నిర్వహణ
శ్రీముఖలింగం (జలుమూరు) జూన్‌ 7:
శ్రీముఖలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం ధ్వజారోహణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం పీని మన్ను తేవడం, శతుమానం బంగారం, కొట్నందంపు, స్వామివారి ఉత్సవమూర్తులను నందివాహనంపై ఊరేగించి కల్యాణ రాయభారం నిర్వహించనున్నారు.  అనంతరం కల్యాణం జరపనున్నారు. 11న శనివారం శాంతిహోమం, బలిహరణ చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన ఏర్పాటుచేయనున్నారు. 12న ఆదివారం ఉదయం శాంతి హోమం, సాయంత్రం పండిత సదస్యం నిర్వహిస్తారు. 13న సోమవారం శాంతిహోమం, బలిహరణ, దొంగవల్లి, మైనోత్సవం, 14న మంగళవారం స్వామివారికి వంశధారలో మంగళస్నానాలతో వేడుకలు ముగియనున్నాయి. స్వామివారి కల్యాణ వేడుకలకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావాలని ఈవో ప్రభాకరరావు కోరారు.

Read more