-
-
Home » Andhra Pradesh » Srikakulam » Srimukhalingeswara Temple Consecration-NGTS-AndhraPradesh
-
శ్రీముఖలింగేశ్వర ఆలయ సంప్రోక్షణం
ABN , First Publish Date - 2022-03-05T05:49:26+05:30 IST
శ్రీముఖలింగేశ్వర ఆలయ సంప్రోక్షణం

శ్రీముఖలింగం (జలుమూరు): శ్రీముఖలింగం ముఖలింగేశ్వర ఆలయంలో శుక్రవారం సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలు చక్రతీర్థ స్నానాలతో ముగియడంతో శుక్రవారం గణపతిపూజ, పుణ్యాహవచనం, నమక, చమక, శాంతిమంత్రం, సజ్యోజాత విధానంతో స్వామికి అభిషేకం చేశారు. ఆలయాన్ని శుద్ధ జలాలతో సంప్రోక్షణ చేశారు. కార్యక్రమంలో ఈవో పి.ప్రభాకరరావు, గ్రామపురోహితులు బంకుపల్లి ప్రభాకరశర్మ, ప్రధాన అర్చకుడు పంచాది ప్రభాకరరావు పాల్గొన్నారు.
దొంగనోట్లతో అర్చకులకు శఠగోపం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు చక్రతీర్థ స్నానాల అనంతరం భక్తులు అర్చకులకు దొంగనోట్లిచ్చి శఠగోపం పెట్టారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు అర్చకులు అష్టదిక్పాలకుల దేవాలయాలకు తీసుకెళ్లి ఆలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు రూ.500 నోట్లు ఇచ్చి తిరిగి రూ.400 చొప్పున తీసుకున్నారని, ఆ తరువాత ఇవి దొంగ నోట్లని తెలిసి అవాక్కయ్యామని అర్చకులు వాపోయారు.