భూ సర్వే వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-07-23T05:28:41+05:30 IST
గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న భూ రీ సర్వేని వేగవంతం చేయాలని జేసీ విజయ సునీత ఆదేశిం చారు. శుక్రవారం మాకివలస గ్రామంలో భూ సర్వేని పరిశీ లించారు.
జేసీ విజయసునీత
నరసన్నపేట: గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న భూ రీ సర్వేని వేగవంతం చేయాలని జేసీ విజయ సునీత ఆదేశిం చారు. శుక్రవారం మాకివలస గ్రామంలో భూ సర్వేని పరిశీ లించారు. చిన్న, పెద్ద కమతాలతో సహా ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలను గుర్తించి సక్రమంగా నమోదు చేయాలన్నారు. అనంతరం మాకివలస, గోపాలపెంట సచివా లయాలను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు అమలు, రెవె న్యూ రికార్డులు, స్పందనలో వచ్చే అర్జీలు వెంటనే పరిష్క రించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్లార్ సింహా చలం, ఎంపీడీవో మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.