కావ్యను స్వదేశానికి రప్పించండి

ABN , First Publish Date - 2022-12-15T23:04:16+05:30 IST

‘పలాసకు చెందిన డోకి జగదీష్‌ కుమార్తె కావ్యకు న్యాయం చేయండి. దుబాయ్‌లో అదనపుకట్నం వేధింపులకు గురవుతున్న ఆమెను స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టాలి’ అని కోరుతూ.. ఎంపీ రామ్మోహన్‌నాయుడు గల్ఫ్‌ దేశాల జాయింట్‌ సెక్రటరీ విపుల్‌కు వినతిపత్రం అందజేశారు.

కావ్యను స్వదేశానికి రప్పించండి
విపుల్‌కు వినతి అందిస్తున్న ఎంపి రామ్మోహన్‌నాయుడు

గల్ఫ్‌ జాయింట్‌ సెక్రటరీకి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు విజ్ఞప్తి

పలాస, డిసెంబరు 15: ‘పలాసకు చెందిన డోకి జగదీష్‌ కుమార్తె కావ్యకు న్యాయం చేయండి. దుబాయ్‌లో అదనపుకట్నం వేధింపులకు గురవుతున్న ఆమెను స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టాలి’ అని కోరుతూ.. ఎంపీ రామ్మోహన్‌నాయుడు గల్ఫ్‌ దేశాల జాయింట్‌ సెక్రటరీ విపుల్‌కు వినతిపత్రం అందజేశారు. గురువారం ఢిల్లీలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆయనను కలిశారు. ‘దుబాయ్‌లో కావ్యను భర్త అవినాష్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. కావ్యను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వెళ్లి ఆమె తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కావ్య కుమార్తె భవిష్యకు ట్రావెల్‌ బ్యాన్‌ ఉండడంతో స్వదేశానికి రాలేకపోతున్నారు. సమస్యను పరిష్కరించి.. కావ్యకు న్యాయంం చేసేలా చర్యలు తీసుకోవాల’ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు.

Updated Date - 2022-12-15T23:04:17+05:30 IST