అవగాహనతోనే విద్యుత్ ఆదా
ABN , First Publish Date - 2022-12-15T23:35:13+05:30 IST
అవగాహనతోనే విద్యుత్‌ను ఆదా చేయవచ్చునని ఏపీఈపీడీసీఎల్ టెక్కలి ఈఈ ఏవీ రాజేశ్వరరావు అన్నారు.
నరసన్నపేట: అవగాహనతోనే విద్యుత్‌ను ఆదా చేయవచ్చునని ఏపీఈపీడీసీఎల్ టెక్కలి ఈఈ ఏవీ రాజేశ్వరరావు అన్నారు. గురువారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కె.ఇందిర, ఏఈలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, జె.రామ్మోహన్‌రావు, డి.శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.