రిక్షా కార్మికుల నిజాయితీ

ABN , First Publish Date - 2022-01-29T05:22:14+05:30 IST

రిక్షా కార్మికుల నిజాయితీ

రిక్షా కార్మికుల నిజాయితీ
వరలక్ష్మికి పర్సును అందిస్తున్న రిక్షా కార్మికులు

- దొరికిన బంగారు ఆభరణాలు బాధితురాలికి అప్పగింత

రాజమ్మకాలనీ(పలాస), జనవరి 28: పలాస హరిజన వీధికి చెందిన రిక్షా కార్మికులు జి.అమ్మారావు, కె.నాగేశ్వరరావు లు తమకు దొరికిన బంగారు ఆభరణాలను బాధితురాలికి అప్పగించి నిజాయితీ చాటుకు న్నారు. మునిసిపల్‌ కార్యాలయ పరిధిలోని రాజమ్మకాలనీకి చెం దిన మార్పు వరలక్ష్మి అనే మహిళ తన రెండున్నర తులాల బంగారు ఆభరణాలను బాగుచేయించేందుకు మార్కె ట్‌లోని ఓ బంగారు దుకాణానికి వచ్చింది. పని పూర్తయిన అనంతరం ఆమె తన పర్సులో ఆభరణాలను పెట్టి తిరిగి ఇంటికి బయలుదేరింది. మునిసి పల్‌ కార్యాలయం గేటు వద్ద ఆమె పర్సు జారిపడిపోయింది. ఈ విషయాన్ని ఆమె ఇంటికి వెళ్లిన తరువాత గుర్తించి లబోదిబోమంది.  కుటుంబ సభ్యులతో కలిసి కాలనీతో పాటు మార్కెట్‌ అంతా వెతికినా పర్సు కనిపించలేదు. ఇంతలో ఈ పర్సు దొరికిన  రిక్షా కార్మికులు అమ్మారావు, నాగేశ్వరరావులు సంబంధిత బాధితుల కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బాధితురాలి వివరాలు తెలియడంతో వరలక్ష్మి ఇంటికి వెళ్లి ఆభరణాలను అప్పగించారు. 

Updated Date - 2022-01-29T05:22:14+05:30 IST