ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-23T05:30:00+05:30 IST

సూర్యభగవానుడి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవా లను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ధర్మపథంలో భాగంగా కచ్ఛపి కళాక్షేత్రం, శ్రీసు మిత్ర కళాసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
త్యాగరాజస్వామి తిరువీధి నిర్వహిస్తున్న దృశ్యం:


అరసవల్లి: సూర్యభగవానుడి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవా లను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ధర్మపథంలో భాగంగా కచ్ఛపి కళాక్షేత్రం, శ్రీసు మిత్ర కళాసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  ఉదయం త్యాగరాజ చిత్రప టాన్ని ఊరేగించారు. అనంతరం ఆదిత్యుని ఆలయ అనివెట్టి మండపంలో త్యారాజ స్వామి భక్త సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, కచ్ఛపి కళాక్షేత్రం, సుమిత్ర కళాసమితి గౌరవ అధ్యక్షులు వెంకట ప్రతాప్‌, సోమేశ్వరరావు, ఆలయ పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

ఆదిత్యుని ఆదాయం రూ.2.32 లక్షలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి ఆదివారం ఒక్కరోజు రూ.2.32 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. దర్శన టిక్కెట్ల ద్వారా రూ.42,400, విరాళాల రూపంలో రూ.50,187, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 1.40లక్షల ఆదాయం లభించినట్లు చెప్పారు. స్పీకర్‌ తమ్మినేని సీతా రాం  స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ  స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. స్పీకర్‌ తనయుడు చిరంజీవినాగ్‌ పాల్గొన్నారు. 
===================================== 

Read more