‘పింఛన్లు పునరుద్ధరించండి’
ABN , First Publish Date - 2022-12-31T23:50:47+05:30 IST
అర్హులైన పేదలందరికీ పింఛన్లు పునరుద్ధ రించాలని అధికార పార్టీ కౌన్సిలర్ బచ్చు జగన్ అధికారులను కోరారు. శనివారం మునిసిపల్ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది.
ఇచ్ఛాపురం: అర్హులైన పేదలందరికీ పింఛన్లు పునరుద్ధ రించాలని అధికార పార్టీ కౌన్సిలర్ బచ్చు జగన్ అధికారులను కోరారు. శనివారం మునిసిపల్ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చ జరగ్గా అన్నింటినీ కౌన్సిల్ ఆమోదించింది. పట్టణంలోని గల ఉప్పలవీధి, కొండి వీధికి గత వారం రోజులుగా పైపులైన్ల ద్వారా తాగునీరు రావడం లేదని కౌన్సిలర్ పల్లంటి మఽ దుమూర్తి తెలిపారు. 11వ వార్డులో కాలువలు ఎందుకు నిర్మించడం లేదని టీడీపీ కౌన్సిలర్ ఆశి లీలారాణి ప్ర శ్నించారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని టీడీపీ కౌన్సిలర్లు పత్రి తవిటయ్య, లీలారాణి విమర్శించారు.