స్పందించి.. ప్రాణాలు కాపాడారు

ABN , First Publish Date - 2022-10-18T04:48:51+05:30 IST

స్పందించి.. ప్రాణాలు కాపాడారు

స్పందించి.. ప్రాణాలు కాపాడారు
దూడను బయటకు తీస్తున్న దృశ్యం

- దూడలను రక్షించిన బాటసారులు

ఇచ్ఛాపురం రూరల్‌: బాహుదానది సమీపంలోని ఈదుపురం రోడ్డులోని ఓ తటా కంలో రెండు దూడలను బాటసారులు రక్షించారు. సోమవారం లంకెతో ఉన్న దూడలు లోతైన తటా కంలో దిగి కొట్టిమిట్టాడుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు బాటసారులు స్పందించారు. కాళ్లకు తాడు చుట్టుకోవడంతో  ఇబ్బందిపడుతూ అపస్మారక స్థితికి చేరుకోవడాన్ని గుర్తించారు. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న కవిటి మండలంలోని కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బడే సాంబమూర్తి తదితరులు నీటిలో దిగి దూడలకు కట్టిన కన్నెను విప్పి బయటకు తీశారు. ఇచ్ఛాపురం పట్టణంలోని బెల్లపడకు చెందిన దూడల యజమాని  కోదండరావు వారికి  కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-10-18T04:48:51+05:30 IST