ఆక్రమణలను అడ్డుకోండి

ABN , First Publish Date - 2022-12-13T00:03:31+05:30 IST

మున్సిపాల్టీ పరిధి 12వ వార్డు బెల్లుపడ అచ్చెంపేటలో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు అడ్డుకోవాలని పలువురు అధికారులను కోరారు.

ఆక్రమణలను అడ్డుకోండి

ఇచ్ఛాపురం: మున్సిపాల్టీ పరిధి 12వ వార్డు బెల్లుపడ అచ్చెంపేటలో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు అడ్డుకోవాలని పలువురు అధికారులను కోరారు. ఈ మేరకు పలువురు యువకులు మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో వినతి పత్రం అందజేశారు. అచ్చెంపేటలో సర్వే నెం. 130లో ఉన్న ప్రభు త్వ స్థలం మున్సిపాల్టీ అధికారులు పార్కు కోసం కేటాయించారు. దీనిని కొంతమంది ఆక్రమంచి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. తక్షణమే పరిశీలించి ఆక్రమణలు తొల గించి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన బి.దొరబాబు, ఖగుపతి, లోకేష్‌, కూర్మారావు, శర్మరాజు, భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:03:31+05:30 IST

Read more