ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2022-11-15T23:58:24+05:30 IST

రైతులు పండించిన పంటలు దళారుల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ తెలిపారు.

ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు

తురకపేట(ఎల్‌.ఎన్‌.పేట): రైతులు పండించిన పంటలు దళారుల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ తెలిపారు. తురకపేట, పెద్దకోట, మిరియాపల్లి గ్రామా ల్లో మంగళవారం ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరిపంటకు క్వింటాకు ఎ-గ్రేడుకు రూ.2060, బి-గ్రేడుకు రూ.2040 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, వ్యవసాయాధికారి పి.లతాశ్రీ, పంచాయతీ కార్యదర్శి జి. తవిటి నాయుడు తదితరులుపాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:58:25+05:30 IST