వ్యర్థ జలాలను అరికట్టండి

ABN , First Publish Date - 2022-09-14T04:55:16+05:30 IST

యూబీ బీరు పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు రాకుండా అరికట్టా లని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

వ్యర్థ జలాలను అరికట్టండి
బీరు పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు :


  యూబీ బీరు పరిశ్రమ ఎదుట రైతుల ఆందోళన

రణస్థలం: యూబీ బీరు పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు రాకుండా అరికట్టా లని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. పరిశ్రమకు చెందిన వ్యర్థ జలాలను రణస్థలం పంచాయతీ పరిధిలోకి సీతం పేట చెరువులోకి విడిచిపెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం పరిశ్రమ వద్ద రైతులు ఆందోళన చేశారు.  వ్యర్థజలాలను చెరువులోకి విడిచి పెట్టడం వల్ల అం దులోని చేపలు మృతి చెందుతున్నాయని, ఈ నీటిని తాగి పశువులు అనారోగ్యా నికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ నీటిని పంట పొలా లకు వినియోగించడం వల్ల పంటలు దెబ్బతిం టున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సర్పంచ్‌ పిన్నింటి భాను అన్నారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-09-14T04:55:16+05:30 IST