సమన్వయంతో విధులు నిర్వహించండి

ABN , First Publish Date - 2022-12-16T23:23:50+05:30 IST

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఇటీవల కాలంలో జరిగిన వరుస సంఘటనలపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జె. భాస్కర రావు ఆరా తీశారు. శుక్రవారం ఆసుపత్రిని సందర్శించి వైద్యాధి కారులు, సిబ్బందితో సమీక్షించారు.

సమన్వయంతో విధులు నిర్వహించండి

టెక్కలి రూరల్‌: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఇటీవల కాలంలో జరిగిన వరుస సంఘటనలపై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జె. భాస్కర రావు ఆరా తీశారు. శుక్రవారం ఆసుపత్రిని సందర్శించి వైద్యాధి కారులు, సిబ్బందితో సమీక్షించారు. ఇటీవల ఆసుపత్రిలో వరుస పరిణామాలకు కారణాలేంటి? కారకులెవరనే అంశాలపై ఆసుపత్రి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన వ్యక్తిపై సెక్యూరిటీ సిబ్బంది వ్యవహ రించిన తీరు, ఆ తరువాత వాగ్వాదం, ఆసుపత్రిలో నర్సింగ్‌ సిబ్బంది, జీడీఏలు, ఫార్మసీ విభాగాల సిబ్బంది మధ్య నెలకొంటున్న విభేదాలు, ఆధి పత్యంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. ఇటువంటి ఘట నలు పునరావృతమైతే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరిం చారు. వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో రోగులకు చికిత్స అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, విఽధుల్లో సమయపాలన పాటించాలన్నారు. సమా వేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సూర్యారావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:23:51+05:30 IST