దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దించండి

ABN , First Publish Date - 2022-07-08T05:25:04+05:30 IST

దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దించండి

దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దించండి
అదపాకలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న కళావెంకటరావు

- టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కళావెంకటరావు 

లావేరు, జూలై 7: రాష్ట్రాన్ని పాలిస్తోన్న దగాకోరు ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో  గద్దె దించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంక టరావు పిలుపునిచ్చారు. అదపాక, కొత్తకోట గ్రామాల్లో గురువారం సాయంత్రం  నిర్వ హించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి సీఎంగా గద్దె ఎక్కిన జగన్‌రెడ్డి నేడు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.  రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంద న్నారు. అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పా రు. అదపాక- గుర్రాలపాలెం, కొత్తకుంకాం మీదుగా పైడా యవలసకు వెళ్లే రహదా రిని టీడీపీ హాయాంలో వేసినందుకు గాను మాజీ ఎంపీపీ మీసాల వెంకటరమణ, కిల్లారి నాగేశ్వరరావు, అదపాక గ్రామస్థులు కళాకు కృతజ్జతలు తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర పాలన సాగించే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముప్పిడి సురేష్‌, పిన్నింటి మధుబాబు, నడిమింటి చార్లేష్‌, ఐ.తోటయ్య దొర, ఆర్‌.ప్రకాశరావు, ఎం.రామ్మూర్తి, రొక్కం సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ గెలుపే ధ్యేయం 

ఎచ్చెర్ల, జూలై 7: రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు. బడివానిపేట గ్రామంలో గురువారం గ్రామస్థుల ను, స్థానిక టీడీపీ నేతలను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ పరిపాలించే సత్తా ఒక్క టీడీపీకే సాధ్యమని తెలిపారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్‌లు వారది ఎర్రయ్య, చౌదరి అవినాష్‌, మాజీ ఎంపీటీసీ గొంటి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టిడీపీ  బలోపేతానికి,  బీసీ సాధికార సమితి కమిటీలు ఏర్పాటుకోసం  పర్యటిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర సాధికార సమితి కన్వీనర్‌ కొండా శంకరరెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవీలను కలిశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని వారికి చెప్పినట్లు తెలిపారు. 

Read more