చికిత్స పొందుతూ ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-12-07T23:45:54+05:30 IST

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హిరమండలం చిన్న కోరాడ వీధికి చెందిన అంగూరు పకీరు(50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందాడు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

హిరమండలం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హిరమండలం చిన్న కోరాడ వీధికి చెందిన అంగూరు పకీరు(50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తి చెందాడు. ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పకీరు ప్రతిరోజూ మద్యం తాగివచ్చి భార్య శకుంతలతో గొడవ పడేవాడు. మంగళవా రం ఇంటిని భర్తకు అప్పజెప్పి ఆమె బయటకు వెళ్లింది. పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చే సరికి పకీరు తాడుతో ఉరేసుకొని ఉన్నాడు. తన చిన్న కుమార్తె సునీత సహాయంతో కిందకు దించింది. కొన ఊపిరితో ఉన్న ఆయనను 108 వాహనంలో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T23:45:55+05:30 IST