నవంబరు నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2022-10-07T06:40:36+05:30 IST
సామర్లకోట మండలంలో పలు గ్రామాలలో నిర్మాణాలలో ఉన్న గ్రామ సచివాలయాలు, గృహనిర్మాణాలు, నాడు-నేడు పాఠశాల అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ కేంద్రాల భవనాలు నవంబరు నెలాఖరులోగా పూర్తిచేసేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మండల ఇంజనీర్, పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో కృషిచేయాలని కాకినాడ డీఎల్డీవో పాటంశెట్టి నారాయణమూర్తి ఆదేశించారు.
డీఎల్డీవో నారాయణమూర్తి
సామర్లకోట, అక్టోబరు 6: సామర్లకోట మండలంలో పలు గ్రామాలలో నిర్మాణాలలో ఉన్న గ్రామ సచివాలయాలు, గృహనిర్మాణాలు, నాడు-నేడు పాఠశాల అభివృద్ధి పనులు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ కేంద్రాల భవనాలు నవంబరు నెలాఖరులోగా పూర్తిచేసేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మండల ఇంజనీర్, పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో కృషిచేయాలని కాకినాడ డీఎల్డీవో పాటంశెట్టి నారాయణమూర్తి ఆదేశించారు. సామర్లకోట ఎంపీడీవో డి. శ్రీలలిత ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వివిధ అబివృద్ధి పనులు నిర్వహణ తీరుపై డీఎల్డీవో నారా యణమూర్తి సమీక్షించారు. ఈ సమీక్షలో ఎంపీడీవో శ్రీలలిత తోపాటు హౌసింగ్ డీఈ ఆర్‌ఎస్‌కె. రాజు, మండల ఇంజనీర్ మణిమాల, ఆయా గ్రామాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీఎల్డీవో మాట్లాడుతూ ఇటీవల సామర్లకోట మండలంలో భవననిర్మాణాలు, గృహ నిర్మాణాలు తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వెనుకబడ్డాయన్నారు. ఇందుకు కారణాలు అన్వేషించి క్షేత్ర స్ధాయిలో వేగవంతం అయ్యేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. డీఈ ఆర్‌ఎస్‌కె. రాజు మాట్లాడుతూ గ్రామా లలో గృహనిర్మాణం వేగవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శులు సైతం సహకరించాలన్నారు. అనంతరం ఎంపీ డీవో శ్రీలలిత మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేందుకు అధికారులు వారాంతపు లక్ష్యాలను నిర్ధేశించుకోవాలన్నారు. ఈ సందర్బంగా అడ్మినిస్ట్రేటివ్ అఽధికారి సాయిబాబు తది తరులు పాల్గొన్నారు. అంతకుముందు డీఎల్డీవో నారాయణ మూర్తి, ఎంపీడీవో నారాయణమూర్తి తదితర అధికారులతో కలిసి ఉండూరు, అచ్చంపేట గ్రామాలలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయ భవనాల వాస్తవ ప్రగతిని పరిశీలించారు.